లేటెస్ట్..అవైటెడ్ “దృశ్యం 2” ఫస్ట్ లుక్ కి ముహూర్తం ఫిక్స్.!

Published on Sep 18, 2021 12:01 pm IST

టాలీవుడ్ మోస్ట్ లవబుల్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన రీసెంట్ సినిమా “నారప్ప” ఓటిటి లో రిలీజ్ అయ్యి భారీ హిట్ అయ్యింది. కానీ అది ఓటిటి రిలీజ్ అవ్వడం పట్ల అభిమానులు సహా జెనరల్ ఆడియెన్స్ లో కూడా కాస్త నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. దీనితో తన మరో మోస్ట్ అవైటెడ్ సినిమా “దృశ్యం 2” మేకర్స్ థియేట్రికల్ రిలీజ్ కే ఓకే చెప్పనున్నారని బజ్ ఆ మధ్య వచ్చింది.

మరి ఇదిలా ఉండగా ఈరోజు మేకర్స్ ఓ అప్డేట్ న్నీ ఇస్తున్నామని నిన్న తెలిపారు. మరి ఇప్పుడు దానిని రివీల్ చేసేసారు. ఈ సినిమా మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఈ రానున్న 20 సెప్టెంబర్ ఉదయం 10 గంటల 8 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు ముహూర్తం ఫిక్స్ చేశారు. అలాగే మోషన్స్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేస్తున్నారట. మరి మళయాలంలో ఆల్రెడీ బిగ్ బ్లాక్ బస్టర్ అయ్యిన ఈ చిత్రాన్ని తెలుగులో కూడా జీతూ జోసెఫ్ నే చాలా శరవేగంగా పూర్తి చేశారు. అలాగే ఈ చిత్రంలో మీనా, ఎస్తర్ అనీల్ తదితరులు కూడా నటించారు.

సంబంధిత సమాచారం :