అవైటెడ్ “డబుల్ ఇస్మార్ట్” అప్డేట్ కి టైం ఫిక్స్

అవైటెడ్ “డబుల్ ఇస్మార్ట్” అప్డేట్ కి టైం ఫిక్స్

Published on May 11, 2024 4:57 PM IST


ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా అలాగే మాస్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ క్రేజీ మాస్ చిత్రం “డబుల్ ఇస్మార్ట్”. మరి దీనిపై భారీ అంచనాలు నెలకొనగా గతంలో వచ్చిన సై ఫై యాక్షన్ థ్రిల్లర్ ఇస్మార్ట్ శంకర్ కి ఇది సీక్వెల్ గా వస్తుంది.

ఇక గత కొన్నాళ్ల నుంచి అప్డేట్ అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానుల నిరీక్షణకు మేకర్స్ ఎట్టకేలకి తెర దించారు. మరి ఈ అవైటెడ్ అప్డేట్ కి టైం లాక్ చేస్తూ ఈ మే 11న ఉదయం 10 గంటల 3 నిమిషాలకి రివీల్ చేస్తున్నట్టుగా త్రిశూలంతో కూడిన పవర్ఫుల్ పోస్టర్ తో తెలియజేసారు.

మరి ఈ అప్డేట్ ఏంటి అనేది అప్పటి వరకు వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt) కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అలాగే పూరి జగన్నాథ్ మరియు ఛార్మిలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మాణం వహిస్తుండగా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ మళయాళ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు