ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు టైమ్ ఫిక్స్ చేసిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. ఎప్పుడంటే..?

Bhartha Mahasayulaku Wignyapthi

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahasayulaku Wignyapthi)ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, ఇద్దరు మహిళల మధ్య చిక్కుకున్న ఓ వ్యక్తి జీవితాన్ని ఆసక్తికరంగా చూపించనుంది. 2026 జనవరి 13న ఈ చిత్రం థియేటర్లలోకి రానుండటంతో, సినిమాపై అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి.

ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఘనంగా విడుదల చేసిన చిత్ర బృందం, ఇప్పుడు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమం జనవరి 10న సాయంత్ర 6 గంటల నుంచి హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్‌లో జరగనుండగా, ఇందులో సినిమా తారాగణం, సాంకేతిక బృందం మొత్తం పాల్గొననున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే పలు ఇంటర్వ్యూల షూటింగ్ కూడా ప్రారంభించారు.

ఇక రవితేజ, ఆషిక రంగనాథ్, డింపుల్ హయతి, దర్శకుడు కిషోర్ తిరుమల పాల్గొన్న ప్రత్యేక ఇంటర్వ్యూను ప్రముఖ యాంకర్ సుమ హోస్ట్‌గా ఇటీవల చిత్రీకరించగా, అది త్వరలోనే విడుదల కానుంది. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version