‘జెట్‌లీ’ ట్రైలర్ లాంచ్‌కు టైమ్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

Jetlee

కమెడియన్ సత్య హీరోగా రితేష్ రాణా దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ మూవీ ‘జెట్‌లీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. మే 1న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, మేకర్స్ తాజాగా ట్రైలర్ రిలీజ్ టైమ్ ఫిక్స్ చేశారు.

రేపు (ఏప్రిల్ 22) ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను AAA సినిమాస్‌లో సాయంత్రం 4 గంటల నుంచి నిర్వహించబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ ట్రైలర్ ఎలాంటి ఫన్ పంచనుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

రియా సింఘా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. ‘మత్తు వదలరా’ కాంబోలో వస్తున్న ఈ యాక్షన్ కామెడీ డ్రామాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

Exit mobile version