ట్రైలర్ టైమ్ ఫిక్స్ చేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’.. ఎప్పుడంటే..?

Mana Shankara Varaprasad Garu

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’(Mana Shankara Varaprasad Garu) మంచి బజ్‌తో సంక్రాంతి బరిలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాతో మెగాస్టార్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పాటలకు మంచి క్రేజ్ దక్కింది. ఈ క్రమంలో ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను జనవరి 4న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు.

కాగా, ఈ ట్రైలర్‌ను తిరుపతిలో జరగబోయే ఓ ఈవెంట్‌లో లాంచ్ చేయనున్నారు. ఇక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై ఈ ట్రైలర్‌ను జనవరి 4న సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ మేరకు ఓ సాలిడ్ పోస్టర్‌ను కూడా వారు రిలీజ్ చేశారు. వింటేజ్ అండ్ స్టైలిష్ లుక్స్‌తో మెగాస్టార్ ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నాడు. ఈ ట్రైలర్ పై చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్న సంగతి తెలిసిందే.

దీంతో ఈ మూవీ ట్రైలర్ ఎలాంటి మాసివ్ రెస్పాన్స్ అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో స్టార్ బ్యూటీ నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా విక్టరీ వెంకటేష్ క్యామియో రోల్‌లో నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version