మెగా158 ట్రీట్‌కు టైమ్ ఫిక్స్.. మెగా సెలబ్రేషన్స్‌కు సిద్ధమవుతున్న ఫ్యాన్స్..!

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు మేకర్స్. ‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్‌బస్టర్ అందించిన దర్శకుడు బాబీతో మళ్ళీ కాంబినేషన్ రీపీట్ అవుతూ, ‘మెగా 158’ చిత్రాన్ని రెడీ చేస్తున్నాడు మెగాస్టార్. ఇక ఈ సినిమాలో చిరుని మునుపెన్నడూ చూడని కొత్త కోణంలో చూపించేందుకు బాబీ సిద్ధమయ్యాడు.

ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ను రేపు(ఆగస్టు 22) ఉదయం 8:30 గంటలకు హైదరాబాద్‌లోని శ్రీరాములు థియేటర్‌లో అభిమానుల మధ్య గ్రాండ్‌గా స్క్రీన్ చేయనున్నారు. ఈ స్పెషల్ ఈవెంట్‌లో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ మరియు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పాల్గొని సందడి చేయనున్నారు.

ఈ ప్రకటనతో మెగా అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. మెగాస్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్‌ను పవర్‌ప్యాక్డ్‌గా జరుపుకునేందుకు అభిమానులు రెడీ అవుతున్నారు.

Exit mobile version