అక్కినేని యువ హీరోలు ఇప్పుడు తమ చిత్రాలతో మంచి కంబ్యాక్ లు ఇచ్చి మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. ఇక మిగిలి ఉన్నది మాత్రం వారికి హిట్స్ రావడంలో తనదైన పాత్ర పోషించిన అక్కినేని నాగార్జునే అని చెప్పాలి. నాగార్జున హీరోగా ఇప్పుడు తన కెరీర్ 100వ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సంగతి తెలిసిందే.
దర్శకుడు కార్తిక్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా గ్రాండ్ గా సిద్ధం అవుతుంది. ఇక ఈ సినిమా నుంచి కూడా మేకర్స్ అప్డేట్స్ ని అందిస్తున్నట్టు వచ్చారు. ఇక ఇదిలా ఉండగా కింగ్ 100 గ్లింప్స్ ని రేపు మేకర్స్ విడుదల చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే.
నాగ్ పుట్టినరోజు కానుకగా ఈ అవైటెడ్ గ్లింప్స్ ని మేకర్స్ రేపు రివీల్ చేయనున్నారు. సో అక్కినేని అభిమానులకు ఏ రేంజ్ కిక్ ఇస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే అన్నపూర్ణ ఆ నిర్మాణం వహిస్తున్నారు.
