గెట్ రెడీ..”పూనకాలు లోడింగ్” రిలీజ్ కి టైం ఫిక్స్.!

గెట్ రెడీ..”పూనకాలు లోడింగ్” రిలీజ్ కి టైం ఫిక్స్.!

Published on Dec 30, 2022 11:58 AM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “వాల్తేరు వీరయ్య” కోసం అందరికీ తెలిసిందే. మరి దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అయితే మాస్ మహారాజ రవితేజ కూడా నటిస్తుండగా ఈ చిత్రం నుంచి అయితే సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా తాను ఇచ్చిన మరో మాస్ ట్యూన్ పూనకాలు లోడింగ్ ని అయితే మేకర్స్ నిన్ననే అనౌన్స్ చేయగా ఇప్పుడు ఈ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది టైం రివీల్ చేశారు.

మొదటిగా ఈ సాంగ్ ని పలు థియేటర్స్ లో రిలీజ్ చేస్తుండగా నెక్స్ట్ అయితే ఈరోజు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకి అయితే రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. సో ఈ సమయానికి అయితే మెగా ఫ్యాన్స్ రెడీగా ఉంటే సరిపోతుంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్స్ గా శృతి హాసన్ మరియు కేథరిన్ లు నటించగా జనవరి 13న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు