రిలీజ్ టైమ్ ఫిక్స్ చేసుకున్న ‘రాజుగారి గది-2’ ట్రైలర్ !


విభిన్న తరహా సినిమాలని ప్రోత్సహిస్తూ వస్తున్న అక్కినేని నాగార్జున మరోసారి ‘రాజుగారి గది-2’ పేరుతో త్వరలో మన ముందుకురానున్నారు. ‘రాజుగారి గది’ వంటి థ్రిల్లర్ ను తెరకెక్కించిన ఓంకార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ తాలూకు అన్ని పనుల్ని పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అక్టోబర్ 13న విడుదలకానున్న ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను రేపు ఉదయం 10 గంటల 30 నిముషాలకు రిలీజ్ కానుంది.

ఇందులో నాగార్జున మానసిక వైద్యుడిగా కనిపించనుండగా సమంత ఒక ఆత్మ పాత్రలో నటించారు. ఇందులో నాగార్జునకు జోడీగా శీరత్ కపూర్ నటిస్తోంది. ఈ చిత్రం ‘రాజుగారి గది’ కి సీక్వెల్ కాదని, కథ, కథనం, పాత్రలు అన్నీ కొత్తగా ఉంటాయని నాగార్జున గతంలోనే తెలిపారు. పివిపి సినిమా, మ్యాటనీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో ఇంకో విశేషమేమిటంటే నాగార్జున హర్రర్ జానర్లో సినిమా చేయడం ఇదే మొదటిసారి.