‘మజాకా’ టీజర్‌కు టైమ్ ఫిక్స్

‘మజాకా’ టీజర్‌కు టైమ్ ఫిక్స్

Published on Jan 11, 2025 11:11 PM IST

యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మజాకా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు డైరెక్ట్ చేస్తుండగా పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా సందీప్ కిషన్ కెరీర్‌లో 30వ చిత్రంగా తెరకెక్కుతోంది.

అయితే, ఈ సినిమా నుంచి సంక్రాంతి కానుకగా ఓ సాలిడ్ ట్రీట్ రానుంది. ఈ మూవీ టీజర్‌ను జనవరి 12న సాయంత్రం 6.03 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. దీంతో ఈ మూవీ ఎలాంటి కథతో తెరకెక్కుతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

ఈ సినిమాలో అందాల భామ రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ కథను అందిస్తుండగా లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాను రాజేష్ దండా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు