టైం ఫిక్స్ చేసుకున్న “టైగర్ నాగేశ్వరరావు” రెండో సాంగ్

Published on Sep 21, 2023 2:03 pm IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ నపూర్ సనన్ హీరోయిన్ గా దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “టైగర్ నాగేశ్వరరావు” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం రవితేజ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ అండ్ అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కుతూ ఉండగా ఈ సినిమాపై హైప్ కూడా అదే లెవెల్లో వెళ్తుంది. ఇక ఈ సినిమా నుంచి అయితే మేకర్స్ ఒకో సాంగ్ ని రిలీజ్ చేస్తుండగా సినిమా రెండో సాంగ్ పై అయితే ఇపుడు వారు అప్డేట్ ని అందించారు.

సంగీత దర్శకుడు జివి ప్రకాష్ ఇచ్చిన ఈ రెండో సాంగ్ వీడు టైటిల్ తో ఈరోజు సాయంత్రం 7 గంటల 2 నిమిషాలకి అయితే రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ఇప్పుడు లాక్ చేశారు. అంతే కాకుండా తెలుగులో సహా పాన్ ఇండియా భాషల్లో అయితే ఈ సాంగ్ ఇప్పుడు లాంచ్ కానుంది. ఇక ఈ చిత్రంలో రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ సహా పలువురు ముఖ్య నటులు నటిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ చిత్రం ఈ అక్టోబర్ 20న అయితే గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం :