టైమ్ ఫిక్స్ చేసుకున్న లవ టీజర్ !
Published on Aug 22, 2017 4:43 pm IST


తారక్ నటిస్తున్న తాజా చిత్రం ‘జై లవ కుశ’ ముగింపు దశకు చేరుకుంది. పాటలు మినహా మిగతా షూటింగ్ మొత్తం పూర్తిచేసుకున్న ఈ చిత్రం అనుకున్న తేదీ సెప్టెంబర్ 21న రిలీజ్ కానుంది. దీంతో ఒకవైపు ఎన్టీఆర్ డబ్బింగ్ పనుల్లో నిమగ్నమవగా టీమ్ ప్రమోషన్స్ పనిలో ఉన్నారు. ఈ ప్రమోషన్లలో భాగంగానే అందరూ ఎదురుచూస్తున్న రెండవ టీజర్ ను సిద్ధం చేస్తున్నారు.

లవ పాత్రకు సంబందించిన ఈ టీజర్ ను ఈ నెల 24న సాయంత్రం 5 గంటల 40 నిముషాలకు రిలీజ్ చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ తెలిపింది. మొదటి పాత్ర ‘జై’ టీజర్ విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ టీజర్ ఎలా ఉంటుందో చూడలానే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన నివేత థామస్, రాశి ఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 
Like us on Facebook