శ్రీవిష్ణు నెక్స్ట్ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రేపే రిలీజ్!

Published on Feb 13, 2023 2:10 pm IST

ప్రముఖ టాలీవుడ్ నటుడు శ్రీ విష్ణు వివాహ భోజనంబు చిత్రం దర్శకుడు రామ్ అబ్బరాజుతో చేతులు కలిపాడు. ఈ చిత్రంలో బిగిల్ ఫేమ్ రెబా మోనికా జాన్ కథానాయిక గా నటిస్తుంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, రేపు ఉదయం 11:07 గంటలకు ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఎకె ఎంటర్టైన్‌మెంట్స్ సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ సినిమా లో ప్రముఖ నటీనటులు ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :