మరో సారి సాఫ్ట్ టైటిల్ తో రానున్న బెల్లంకొండ హీరో !

Bellamkonda Sreenivas

తేజ దర్శకత్వంలో యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న కొత్త చిత్రానికి టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈచిత్రానికి ‘సీత’ అనే టైటిల్ ను ఖరారు చేశారట. తర్వలోనే ఈ టైటిల్ ను అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఈ చిత్రంలో కాజల్ టైటిల్ రోల్ లో నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రలో నటిస్తుండగా రామ్ పాత్రలో సాయి శ్రీనివాస్ కనిపించనున్నాడు.

ఏకే ఎంటర్టైమెంట్స్ పతాకం ఫై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈచిత్రం మార్చి లో విడుదలకానుంది. ఇక ఇంతకుముందు ‘జయ జానకి నాయక’ అనే సాఫ్ట్ టైటిల్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టాడు సాయి. మరి ఈ సారి కూడా ఈ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందో లేదో చూడాలి.

Exit mobile version