‘ఆర్ఎక్స్ 100’ హీరో తమిళ చిత్రం టైటిల్ ఖరారు !

అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ , పాయల్ రాజ్ పుత్ జంటగా తెరకెక్కిన ఈచిత్రం ‘ఆర్ఎక్స్ 100’. ఈ సినిమా ఇటీవల చిన్న చిత్రంగా విడుదలై అద్భుతమైన కలెక్షన్స్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఇక మొదటి చిత్రంతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో కార్తికేయ తన రెండవ చిత్రాన్ని తమిళ దర్శకుడు టి ఎన్ కృష్ణ దర్శకత్వంలో చేస్తున్నాడు .

తమిళ భాషలో తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని ‘కబాలి, మల్లన్న , తేరి’వంటి భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించిన ప్రముఖ తమిళ చిత్ర నిర్మాణ సంస్థ వి క్రియేషన్స్ పతాకం ఫై కలై పులి ఎస్ తాను నిర్మిస్తున్నారు. ఇక తాజాగా ఈచిత్రం యొక్క టైటిల్ ను ఖరారు చేశారు. ‘హిప్పీ’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈచిత్రానికి నివాస్ ప్రసన్న సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version