సుదీర్ బాబు సినిమాకు టైటిల్ ఖరారు !

సుదీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సినిమా ఇటివల ప్రారంభం అయ్యింది. శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను నిర్మాత. అదితి రావ్ హైద్రి ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సమ్మోహనం అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.

అనూహ్యమైన కథాంశంతో ఆద్యంతం వినోదాత్మకంగా తెరకేక్కిస్తున్నాడు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం సమకూరుస్తున్నాడు. శమంతకమని సినిమా తరువాత సుదీర్ బాబు వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ హీరో నటించిన వీరభోగ వసంతరాయలు సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.