
నాగార్జున – కార్తీ ఈ ఇద్దరి కాంబినేషన్లో తెలుగు, తమిళ భాషల్లో ఓ భారీ మల్టీస్టారర్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే! పీవీపీ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇప్పటివరకూ టైటిల్, ఫస్ట్‌లుక్ లాంటివేవీ విడుదల కాకున్నా, నాగార్జున-కార్తీల కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై అంతటా మంచి అంచనాలున్నాయి. గత కొద్దిరోజుల క్రితమే యూరప్‌లో ఓ భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్. టైటిల్‌ను ఈ వారమే విడుదల చేసేందుకు సినిమా యూనిట్ ప్లాన్ చేస్తోంది.
సెప్టెంబర్ 18న తెలుగు, తమిళ వర్షన్లకు సంబంధించిన టైటిల్స్‌తో పాటు ఫస్ట్‌లుక్స్ కూడా విడుదల కానున్నాయి. ఇదే విషయాన్ని నాగార్జున తెలియజేస్తూ ఓ ఫోటో పోస్ట్ చేశారు. సెలెబ్రెషన్ ఆఫ్ లైఫ్ అన్న ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా ప్రచారం పొందుతోంది. ఈ సినిమా టైటిల్స్ విషయంలో చాన్నాళ్ళుగా రకరకాల పేర్లు వినబడుతూ వస్తోన్న నేపథ్యంలో ఒరిజినల్ టైటిల్ ఏమై ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. తమన్నా హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాలో అనుష్క ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.