మహేష్ 24వ సినిమా షూటింగ్ అప్డేట్ !


మహేష్ తన కెరీర్లోనే ఉత్తమమైన చిత్రమని చెప్పుకునే ‘శ్రీమంతుడు’ ని డైరెక్ట్ చేసిన కొరటాల శివతోనే ఆయన మరో సినిమా చేస్తున్నారు. దేశభక్తి నైపథ్యంలో ఉండనున్న ఈ సినిమా యొక్క రెగ్యులర్ ఈ మధ్యే మొదలైంది. హైదరాబాద్లో ఒక షెడ్యూల్ ను కూడా పూర్తిచేశారు. అలాగే కొత్త షెడ్యూల్ ను ఈ నెల 1న మొదలుపెట్టారు. ‘స్పైడర్’ కు సంబందించిన చిన్న చిన్న పనుల్లో బిజీగా ఉండటం వలన మొదటి మూడు రోజులు ఈ షెడ్యూల్లో పాల్గొనలేకపోయిన మహేష్ ఈరోజు నుండి షూట్లో జాయిన్ అయ్యారు.

మంచి క్రేజ్ ఉన్న సినిమా కావడంతో హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ తారాస్థాయిలో జరిగే అవకాశముంది. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ సంగీతం సమకూరుస్తుండగా 2018 ఆరంభంలో సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు ‘భరత్ అనే నేను’ అనే టైటిల్ ప్రచారంలో ఉండగా టీమ్ ఇంకా దీనిపై ఖచ్చితమైన ప్రకటన వదలలేదు. ఇకపోతే మహేష్ యొక్క ‘స్పైడర్’ చిత్రం ఈ నెల 27న రిలీజ్ కానుంది.