నాకు యువ హీరోలు పోటీ కాదు…..నేనే వాళ్లకు పోటీ – 53వ అంతర్జాతీయ చలన చిత్ర వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్

నాకు యువ హీరోలు పోటీ కాదు…..నేనే వాళ్లకు పోటీ – 53వ అంతర్జాతీయ చలన చిత్ర వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్

Published on Nov 28, 2022 9:42 PM IST


ప్రస్తుతం గోవాలో 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది బెస్ట్ ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ అవార్డుని మెగాస్టార్ చిరంజీవి గెల్చుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ అవార్డుని నేడు భార్య సురేఖతో కలిసి గోవా వచ్చిన మెగాస్టార్ ప్రత్యేకంగా అతిథుల సమక్షంలో అందుకున్నారు. ఇక అవార్డు అందుకున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, సరైన సమయంలోనే నాకు ఈ అవార్డు ఇచ్చారని భావిస్తున్నా, ఈ క్షణం కోసం దశాబ్దాల నుంచి ఎదురుచూస్తున్నా అన్నారు. ముఖ్యంగా ఈ అవార్డుని తనకు అందించిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవ కమిటీకి మరియు భారత ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఇక ఈ అవార్డు నాకే కాదు నా అభిమానుల్లోనూ ఎనలేని ఉత్సాహాన్ని నింపిందని తెలిపారు. గతంలో జరిగిన చలన చిత్రోత్సవ వేడుకలకు ఒకసారి వచ్చాను, అప్పట్లో దక్షిణాదికి చెందిన ఒక్క నటుడి ఫోటో లేదని అప్పుడు చాలా బాధపడ్డాను, నిజానికి సినిమా ఎక్కడైనా తీయొచ్చు, కానీ అది భారతీయ సినిమా అని గుర్తుపెట్టుకోవాలి అన్నారు. అయితే ఇప్పుడు ప్రాంతీయ బేధాలు పోయి భారతీయ సినిమా అనే రోజు రావడం ఆనందదాయకమన్నారు. కాగా ప్రస్తుతం తనకు యువ హీరోలు పోటీ కానేకాదని, నేనే వాళ్లకు పోటీ అని అన్నారు. నిజానికి వాళ్లకు ఇప్పుడు చాలా కష్టకాలమే అని, అయితే కష్టంతో ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధించవచ్చని నేటి నటీనటులకు పిలుపునిచ్చారు మెగాస్టార్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు