‘పంచతంత్రం’ నేటి యువత ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జీవితా రాజశేఖర్

‘పంచతంత్రం’ నేటి యువత ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జీవితా రాజశేఖర్

Published on Dec 8, 2022 3:08 AM IST

ఐదు కథల సమాహారంగా హర్ష పులిపాక దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ పంచతంత్రం. సృజన్, అఖిలేష్ నిర్మాతలుగా గ్రాండ్ గా రూపొందిన ఈ మూవీలో బ్రహ్మానందం, స్వాతి రెడ్డి, దివ్య శ్రీపాద, శివాత్మిక, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలని పోషించగా ఈ సినిమాను, ఈ నెల 9వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రశాంత్ విహారి ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నేడు గ్రాండ్ గా నిర్వహించింది యూనిట్. డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ, తమ కుమార్తెలు ఇద్దరూ మొదట్లో సినిమాల్లో నటిస్తాము అని చెప్పినపుడు, తనకు రాజశేఖర్ గారికి ఒకింత ఆందోళనగా అనిపించిందన్నారు.

ఎందుకంటే ఇక్కడ సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా తట్టుకోగలగాలని అన్నారు. ఇక ఈ మూవీలో ఐదు కథలని హర్ష గారు హ్యాండిల్ చేసిన విధానం, నడిపించిన తీరు తనకు ఎంతో నచ్చాయన్నారు. అలానే సినిమాలో సుభాష్, లేఖ పాత్రలు తనకు ఎంతో ఇష్టమని, నేటి సమాజంలో రిలేషన్స్ అనేవి ఎలా ఉన్నాయో అందరూ చూస్తున్నాం, ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసి తీరాలని, వివాహబంధం గొప్పతనంతో పాటు నేటి యువత అందరికీ ఈ మూవీ ఎంతో ఉపగయోగకరంగా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా పంచతంత్రం వంటి మంచి సినిమాలు ఆడియన్స్ ఆదరిస్తే బాగుంటుందని, అయితే తాను కోట్లు కొల్లగొట్టాలని చెప్పడం లేదని, మంచి కంటెంట్ ఉన్న సినిమాలని తెలుగు వారు ఎప్పుడూ ఆదరిస్తారు అనే నమ్మకం తనకు ఉందని ప్రత్యేకంగా మూవీ యూనిట్ కి జీవిత రాజశేఖర్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు