
శ్రీహరి ఉదయగిరి, హేమంతిని, రోషిక, మహావీర్, అస్రిత్ మాధుర్, పోసాని కృష్ణమురళి నటీనటులుగా విఎస్ వాసు దర్శకత్వంలో తెరకెక్కిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘టోల్ ఫ్రీ నెంబర్ 143’. ఇది చాలా కాస్ట్ గురూ అనేది కాప్షన్. భాస్కర్ గ్రూప్ ఆఫ్ మీడియా పతాకంపై దాసరి భాస్కర్ యాదవ్ ఈ సినిమాను నిర్మించారు. శ్రీ వెంకట్ సంగీత దర్శకుడు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్వీ.ప్రసాద్, మారుతి, బసిరెడ్డి, సురేష్ కొండేటి తదితరులు హాజరయ్యారు. వారితో పాటు సినిమా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
ముఖ్య అతిధిగా హాజరయిన మారుతి తొలి సిడిని ఆవిష్కరించి నిర్మాత ఎన్వీ.ప్రసాద్ కు అందజేశారు. అనంతరం సినిమా విజయం సాదించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా ఇది. ప్రేమకు ముందు, తర్వాత యువత ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అనే అంశాలను ఈ సినిమాలో చూపిస్తున్నాం. అని దర్శకుడు విఎస్ వాసు అన్నారు. మారుతి గారి స్ఫూర్తితో ఈ సినిమాను నిర్మిస్తున్నాము. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమాను దర్శకుడు మలిచారు అని నిర్మాత దాసరి భాస్కర్ యాదవ్ అని అన్నారు.