కన్నడ డైరెక్టర్ తో టాలీవుడ్ యాక్షన్ హీరో మూవీ ఫిక్స్ ?

Published on Mar 3, 2023 12:30 am IST


టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ ఇటీవల మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా కమర్షియల్ మూవీ ద్వారా ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చారు. అయితే ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం యువ దర్శకుడు శ్రీవాస్ తో రామబాణం అనే ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు గోపీచంద్. భారీ స్థాయిలో రూపొందుతోన్న ఈ మూవీలో డింపుల్ హయతి హీరోయిన్ గా నటిస్తుండగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ దీనిని భారీ స్థాయిలో దీనిని నిర్మిస్తోంది.

అయితే విషయం ఏమిటంటే శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధా మోహన్ నిర్మాతగా కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వంలో ఒక మూవీ చేయడానికి గోపీచంద్ సిద్ధం అయ్యారట. భారీ స్థాయి ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈమూవీ అఫీషియల్ గా రేపు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీకి సంబదించిన ఇతర వివరాలు అన్ని కూడా రేపు వెల్లడి కానున్నాయి. కాగా ఇటీవల కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన శివ వేదా మూవీని తెరకెక్కించి మంచి సక్సెస్ అందుకున్నారు హర్ష.

సంబంధిత సమాచారం :