దర్శకరత్న దాసరి నారాయణ రావుకు సినీ ప్రముఖుల సంతాపం


దర్శక రత్న దాసరి నారాయణరావు మృతితో తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. తెలుగు సినీ ప్రముఖులు, దాసరితో అనుభందం ఉన్నా సెలెబ్రిటీలు ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ నటులు, దర్శకులు దాసరి మరణం వారి స్పందనని తెలియజేసారు.

అస్తమించిన తెలుగు శిఖరం-బోయపాటి శీను

దర్శక ద్రోణాచార్యుడు మా దాసరి గారు మా మధ్య లేరనే వార్త నా మనసుని కలచివేసింది. ఆయన మరణం తెలుగు సినిమాకి తీరని లోటు.
ఆయన చూపిన బాటలో మా దర్శకులం అందరం నడిచి.. ఆయన ఆశయాన్ని నెరవేరుస్తాం.

నాకు జీవితాన్నిచ్చిన దాసరి గారి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నా -మోహన్ బాబు

నాకు నటుడిగా గుర్తింపునిచ్చిన దాసరి గారి మరణాన్ని జీర్ణించుకోవడం కష్టంగానే ఉన్నా.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ సాయినాధుని సాక్షిగా కోరుకొంటున్నాను.

దాసరి గారి మరణం తెలుగు చిత్రసీమకు తీరని లోటు-నందమూరి బాలకృష్ణ

తెలుగు సినిమా గమనానికి సరికొత్త దారి చూపిన దాసరి గారి మరణం తెలుగు చిత్రసీమకు తీరని లోటు. ఆయన మరణానికి చింతిస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నాను.

మా కులపెద్ద కన్నుమూత మాకు తీరని లోటు-క్రిష్ జాగర్లమూడి

మా దర్శకుల పెద్ద, దర్శకుల స్థాయి పెంచిన ప్రతిభాశాలి దాసరి గారి మరణం మా దర్శకులకు మాత్రమే కాక తెలుగు చిత్రసీమకు కూడా పెద్ద దెబ్బ. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకొంటున్నాను.

ఒక దర్శకుడిగా నాకు దార్శనికుడు, తెలుగు చిత్రసీమకు మార్గ దర్శకుడు దర్శకరత్న దాసరి గారి మరణం మాకు తీరని లోటు.
-దర్శకుడు శ్రీవాస్

ఒక దర్శకుడిగా, ఇండస్ట్రీ పెద్దగా దాసరి గారి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు!
-గోపీచంద్

దర్శకరత్న దాసరిగారి మరణం తెలుగు చిత్రసీమకు తీరని లోటు, నిర్మాత క్షేమం కోరే ఆయనలాంటి వ్యక్తి మరణం జీర్ణించుకోవడం కష్టం.
-సాయి కొర్రపాటి

ఇండస్ట్రీ ఎదుగుదల కోసం అనునిత్యం ఆరాటపడిన వ్యక్తి దాసరి గారు, అలాంటి మనిషి మన మధ్య లేకపోవడం బాధాకరం.
-నారా రోహిత్

మా దర్శకులందరికీ పెద్ద దిక్కులాంటి దాసరి గారు శారీరికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన ఆశయాలు మాత్రం ఎప్పటికీ మమ్మల్ని నడిపిస్తూనే ఉంటాయి.
-దర్శకుడు సంపత్ నంది

దాసరి గారు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన సాధించిన ఘనత, తెలుగు సినిమాకు తీసుకొచ్చిన గౌరవం చిరస్మరణీయం.
-పి.వి.పి

ఆయన దర్శకదిగ్గజం మాత్రమే కాదు, తెలుగు సినిమాకు మణిహారం, ఆయన లాంటి గొప్ప వ్యక్తి ఇక లేరనే వార్త మింగుడుపడడం లేదు.
-చందు మోండేటి

మాలాంటి యువ నటులందరికీ స్ఫూర్తి అయిన దాసరి గారి మరణం మాకు తీరని లోటు.
-విజయ్ దేవరకొండ

తెలుగు సినిమా రొమ్ము విరుచుకొని నిలబడేలా చేసిన దార్శనికుడు దాసరి గారు మరణించడం మా దర్శకులందరికీ తీరని లోటు.
-దర్శకుడు ఎన్. శంకర్

స్టార్ డమ్ నటులకు మాత్రమే సొంతం కాదని ప్రూవ్ చేసి, దర్శకుడి పేరు పోస్టర్ పైకి తెచ్చిన మహనీయుడు దాసరి, ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు.
-దర్శకుడు తేజ

తెలుగువాడి సత్తాను ప్రపంచానికి పరిచయం చేసి.. దర్శకుడి స్థాయిని పెంచిన దర్శకరత్న దాసరి మరణం నన్ను ఎంతో బాధిస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటున్నాను.
-నటుడు శర్వానంద్

తెలుగు చిత్రసీమకు పెద్ద దిక్కులాంటి దాసరి నారాయణరావు గారి మరణం జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటున్నాను.
-నటుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్

ఇండస్ట్రీకి మాత్రమే కాదు మా కుటుంబానికి కూడా పెద్ద దిక్కు లాంటి దాసరి గారి మరణం మాకు తీరని లోటు.
-మంచు విష్ణు, మంచు మనోజ్

నేను తీసిన మొదటి సినిమాకి మొదటి అభినందన లభించింది దాసరి గారి నుంచే, అలాంటి వ్యక్తి మరణం నన్ను చాలా బాధించింది.
-దర్శకుడు క్రాంతి మాధవ్

నాలాంటి ఎంతోమంది నిర్మాతలకు స్ఫూర్తి ఆయన, మా “పెళ్ళిచూపులు” చిత్రానికి అనుక్షణం వెన్నంటి ఉన్న దాసరి గారు మరణించడాన్ని తట్టుకోలేకున్నాం.
-రాజ్ కందుకూరి

నన్ను నటుడిగా ఆదరించి ఆశీర్వదించిన అతి తక్కువ మంది వ్యక్తుల్లో దాసరి గారు ప్రధములు, అటువంటి గొప్ప మనిషి మరణం ఇండస్గ్రీకి తీరని లోటు.
-నటుడు శ్రీవిష్ణు

ఒక నటుడిగా, ఒక దర్శకుడిగా, ఒక వ్యక్తిగా నాపై దాసరి గారి ప్రభావం చాలా ఉంటుంది. అలాంటి మనిషి మరణ వార్త నన్ను ఎంతగానో బాధించింది.
-నటుడు, దర్శకుడు రవిబాబు

నా సినిమాల్లో తెలుగుదనం ఎక్కువగా ఉండాలనే ఆలోచన దాసరి గారి వల్లనే వచ్చింది. ఆయన సినిమాలు నాపై చూపిన ప్రభావం అలాంటిది. అలాంటి వ్యక్తి మరణం నన్ను కలచివేసింది.
-దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి

చిన్నాపెద్దా అనే తేడా లేకుండా టాలెంట్ ను ఎంకరేజ్ చేసిన మహోన్నత మనస్తత్వం కలిగిన వ్యక్తి దాసరి నారాయణరావు గారు. ఆయన మరణానికి చింతిస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.
-దర్శకుడు సుధీర్ వర్మ