టాలీవుడ్ దర్శకుడు మారుతీ కి పితృ వియోగం.!

Published on Apr 21, 2022 7:02 am IST

ఎందుకో ఈ మద్య తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పలు విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత రెండు రోజుల వ్యవధిలోనే ప్రముఖ నిర్మాత నారాయణ దాస్ నారంగ్ కన్ను మూయగా నిన్ననే మరో సీనియర్ దర్శకులు తాతినేని స్వర్గస్తులు అయ్యారు. అయితే ఈ రెండు మరచే లోపే మన టాలీవుడ్ కి చెందిన ప్రముఖ దర్శకుడు మారుతి కి పితృ వియోగం అయ్యినట్టు తెలుస్తోంది.

నిన్న అర్ధ రాత్రి సమయంలో దర్శకుడు మారుతీ తండ్రి అయినటువంటి దాసరి వన కుచల రావు గారు మచిలీపట్నంలోని తన స్వగృహం నందున తన 76వ ఏట వారి తుది శ్వాస విడిచారు. దీనితో మారుతి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మరి ఈ వార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు వారి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించారు. మరి వన కుచల రావు గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మా 123తెలుగు యూనిట్ కూడా ఆకాంక్షిస్తుంది. ఓం శాంతి.

సంబంధిత సమాచారం :