హీరోయిన్ గా మారనున్న ఫేమస్ టాలీవుడ్ సింగర్ ?
Published on Nov 19, 2016 3:47 pm IST

geetha-madhuri
మన టాలీవుడ్ లో హీరోయిన్లు సింగర్లుగా మారడం అప్పుడప్పుడు చూశాం గాని సింగర్లే హీరోయిన్లుగా మారడం మాత్రం ఎప్పుడూ జరగలేదు. కానీ ఆ విశేషం కూడా ఇప్పుడు జరగబోతోంది. టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ గీతా మాధురి ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తోందట. ఇంతకు మునుపు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన అనుభవం ఉన్న గీతా మాధురి తమిళ దర్శకుడు రూపొందిస్తున్న ఒక సినిమాలో ముఖ్యమైన పాత్ర పాషిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేగాక ఈ రోల్ కి సంబందించిన షూటింగ్ కూడా ఇటీవలే హైదరాబాద్ లో పూర్తయిందని కూడా అంటున్నారు.

అందానికి అందం, టాలెంట్ రెండూ ఉన్న గీతా మాధురి ఇప్పటి వరకూ సినిమాల్లో ట్రై చేయకుండా సడన్ గా ఇప్పుడు సినిమాల్లోకి రావడం చూస్తుంటే ఒకవేళ ఈ సినిమా క్లిక్ అయితే తరువాత నేరుగా హీరోయిన్ గా చెయ్యొచ్చని కూడా అనిపిస్తోంది. ఇకపోతే ఇంతకీ గీతా మాధురి ప్రస్తుతం చేస్తునం సినిమా ఏమిటి, అందులో ఆమె రోల్ ఎలా ఉంటుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది వంటి విశేషాలు ఇంకా తెలియాల్సి ఉంది.

 
Like us on Facebook