ఏపీలో టికెట్ ధరలపై ప్రముఖ నిర్మాత కీలక కామెంట్స్.!

Published on Dec 9, 2021 9:00 am IST

ఇటీవల ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం టికెట్ ధరల విషయంలో తీసుకున్నటువంటి ఓ సంచలన నిర్ణయం ఎంతటి దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. అయితే దానికి పరిష్కారం దొరుకుతుంది అని అంతా ఆశించారు కానీ ఫైనల్ గా మాత్రం ఎలాంటి సామరస్య పరిష్కారం దక్కలేదు.

టికెట్ ధరలు తగ్గించడంతో పాటుగా బెనిఫిట్ షో లు కూడా ఎక్కడా వెయ్యనివ్వకపోవడంతో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పరిస్థితులు కాస్త క్లిష్టంగా మారాయి. మరి ఈ ధరల విషయంలోనే ప్రముఖ నిర్మాత ఆసియన్ మూవీస్ అధినేత నారాయణ్ దాస్ నారంగ్ కొన్ని కీలక కామెంట్స్ చెయ్యడం వైరల్ గా మారింది.

తెలంగాణాలో టికెట్ ధరలు బాగున్నాయి కానీ ఏపీలో పరిస్థితి బాగాలేదని దేశం అంతా ఒకవైపు వెళుతుంది అప్పుడు మనం కూడా అలాగే వెళ్ళాలి కదా అని సూచించారు. ఇదే ధరలు ఉంటే నిర్మాతలకు కష్టం అవుతుంది అని మన దగ్గర ఉన్నన్ని థియేటర్స్ ఎక్కడా లేవని ఈ కీలక ఇష్యూ పై తన వివరణ ఈ విధంగా ఇచ్చారు.

సంబంధిత సమాచారం :