ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో టాలీవుడ్ నిర్మాత‌ల భేటీ

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో టాలీవుడ్ నిర్మాత‌ల భేటీ

Published on Jun 24, 2024 3:40 PM IST

ఏపీ డిప్యూటీ సీఎంగా ఇటీవ‌ల బాధ్య‌త‌లు స్వీక‌రించిన కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు నిర్మాత‌లు సోమ‌వారం విజ‌య‌వాడ‌లోని క్యాంప్ ఆఫీసులో కలుసుకున్నారు. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ ఎదుర్కొంటున్న ప‌లు స‌మ‌స్య‌ల గురించి వారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ తో చ‌ర్చించ‌నున్నారు.

రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవ‌కాశాలు, సినీ రంగం విస్త‌ర‌ణ‌కు ఉన్న అవ‌కాశాల‌పై ఈ భేటీలో చ‌ర్చించ‌నున్నారు. సినీ ప‌రిశ్ర‌మ ఎదుర్కొంటున్న ఇబ్బందుల‌ను వారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి నివేదించ‌నున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా పాల్గొంటున్నారు.

కాగా, ఈ స‌మావేశానికి సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన నిర్మాత‌లు అల్లు అరవింద్, సి.అశ్వినీద‌త్, ఏ.ఎం ర‌త్నం, ఎస్.రాధాకృష్ణ‌, దిల్ రాజు, బోగ‌ప‌ల్లి ప్ర‌సాద్, డివివి దాన‌య్య‌, శ్రీ‌మ‌తి సుప్రియ‌, ఎన్వీ ప్ర‌సాద్, బ‌న్నీ వాస్, న‌వీన్ ఎర్నేని, నాగ‌వంశీ, టిజి.విశ్వ‌ప్ర‌సాద్ తదిత‌రులు హాజ‌ర‌య్యారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు