SSMB 28 మూవీలో నటించనున్న సీనియర్ స్టార్ నటి ?

SSMB 28 మూవీలో నటించనున్న సీనియర్ స్టార్ నటి ?

Published on Jan 31, 2023 11:30 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయికలో SSMB 28 వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం ఒక ప్రతిష్టాత్మక మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. అతడు, ఖలేజా సినిమాల తరువాత దాదాపుగా పన్నెండేళ్ల విరామం అనంతరం వస్తున్న మూవీ కావడంతో వీరిద్దరి కాంబో మూవీ పై అందరిలో ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పడ్డాయి.

పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన హారికా హాసిని క్రియేషన్స్ వారు దీనిని భారీగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో ఒక కీలకమైన పాత్ర కోసం స్టార్ సీనియర్ నటి రమ్యకృష్ణ ని ఎంపిక చేసినట్లు లేటెస్ట్ టాలీవుడ్ బజ్.

అయితే ఇప్పటికే ఆ పాత్రకు పలువురిని పరిశీలించిన దర్శకుడు త్రివిక్రమ్ ఫైనల్ గా రమ్యకృష్ణ ని తీసుకునేందుకు ఫిక్స్ అయ్యారని, దీనిపై త్వరలోనే యూనిట్ నుండి అఫీషియల్ గా కన్ఫర్మేషన్ రానుందని తెలుస్తోంది. కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మూవీలో మంచి మాస్ రోల్ చేస్తుండగా పీఎస్ వినోద్ దీనికి డీవోపీ గా వర్క్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు