ఇంట్రస్టింగ్ బజ్ : ధనుష్ ‘సార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా టాలీవుడ్ స్టార్ హీరో ?

Published on Feb 11, 2023 2:03 am IST


కోలీవుడ్ స్టార్ నటుడు ధనుష్ హీరోగా సంయుక్తా మీనన్ హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ బైలింగువల్ మూవీ వాతి. తెలుగులో సార్ టైటిల్ తో రిలీజ్ కానున్న ఈ మూవీ పై ధనుష్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ నిర్మిస్తుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్, సాంగ్స్, టీజర్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభించింది. అయితే లేటెస్ట్ టాలీవుడ్ ఇంట్రస్టింగ్ బజ్ ప్రకారం అతి త్వరలో జరుగనున్న ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కి టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పెషల్ గెస్ట్ గా రానున్నారని అంటున్నారు. మరి అదే కనుక నిజం అయితే ఫస్ట్ టైం స్టేజ్ మీద అటు ధనుష్ ఇటు పవన్ ఇద్దరినీ చూడవచ్చు. కాగా దీనిపై మూవీ టీమ్ నుండి అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :