‘హిట్ 2’ ట్రైలర్ పై టాలీవుడ్ స్టార్ యాక్టర్ ప్రసంశలు

‘హిట్ 2’ ట్రైలర్ పై టాలీవుడ్ స్టార్ యాక్టర్ ప్రసంశలు

Published on Nov 25, 2022 11:00 PM IST


అడివిశేష్ హీరోగా హిట్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన తాజా సినిమా హిట్ 2 ది సెకండ్ కేస్. శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని తో కలిసి నాచురల్ స్టార్ నాని ఈ మూవీని నిర్మించారు. యాక్షన్ తో కూడిన థ్రిల్లింగ్ సస్పెన్స్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీలో కృష్ణదేవ్ అలియాస్ కేడి అనే ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో శేష్ కనిపించనున్నారు.

ఇక ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ఒక సాంగ్ తో పాటు మొన్న విడుదలైన ట్రైలర్ ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. అయితే విషయం ఏమిటంటే హిట్ 2 ట్రైలర్ పై కొద్దిసేపటి క్రితం టాలీవుడ్ స్టార్ యాక్టర్ కింగ్ అక్కినేని నాగార్జున తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రసంశలు కురిపించారు. కొద్దిసేపటి క్రితం హిట్ 2 ట్రైలర్ చూసాను, ఇటీవల చూసిన టీజర్ తో పాటు ట్రైలర్ కూడా ఎంతో బాగుండడంతో సినిమా పై మంచి ఆసక్తి ఏర్పరిడింది, మూవీ కోసం ఎదురుచూస్తున్నాను అడివి శేష్ అంటూ నాగార్జున పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ మూవీని డిసెంబర్ 2 న విడుదల చేయనున్నారు మేకర్స్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు