”పుష్ప” రాజ్ ని కలిసాక ఎందుకు తగ్గాలి అంటున్న స్టార్ డైరెక్టర్.!

Published on Feb 3, 2022 8:00 am IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా నటించిన లేటెస్ట్ భారీ సినిమా “పుష్ప ది రైజ్” రిలీజ్ అయ్యి పాన్ ఇండియా సూపర్ హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం రిలీజ్ అయ్యాక మన టాలీవుడ్ నుంచి సహా బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి భారీ స్థాయి అప్లాజ్ ని అందుకున్నారు. మరి ఇదిలా ఉండగా మళ్ళీ చాలా కాలం తర్వాత అల్లు అర్జున్ ని మన టాలీవుడ్ స్టార్ దర్శకుల్లో ఒకరైన హరీష్ శంకర్ మీట్ అయ్యినట్టుగా తమ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

ఒక ఫోటో ని కూడా షేర్ చేసి మేమిద్దరం కలిసినప్పుడు ఎప్పుడూ కూడా ఓ రేంజ్ లో ఫన్నీగా ఉంటుంది. మనం మళ్ళీ కలిసే వరకు ఒక గ్రేట్ టైం దొరికింది అల్లు అర్జున్.. తగ్గేదేలే.. ఎందుకు తగ్గాలి? అంటూ హరీష్ శంకర్ ఈ ఫన్ పోస్ట్ పెట్టారు. ఇక ఇదిలా ఆల్రెడీ వీరి కాంబోలో “డీజే” అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ మీటింగ్ తర్వాత మళ్ళీ సినిమా సెట్టయ్యిందా అనే ఊహాగానాలు అయితే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి.

సంబంధిత సమాచారం :