కార్తికేయ ‘బెదురులంక 2012’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్న టాలీవుడ్ స్టార్ హీరో

కార్తికేయ ‘బెదురులంక 2012’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్న టాలీవుడ్ స్టార్ హీరో

Published on Nov 29, 2022 10:05 PM IST


ఆర్ఎక్స్ 100 మూవీ ఫేమ్ కార్తికేయ గుమ్మకొండ హీరోగా డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న లేటెస్ట్ కామెడీ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా మూవీ బెదురులంక 2012. గోదావరి నేపధ్యంలో సాగే ఈ మూవీ యొక్క ప్రీ లుక్ పోస్టర్ ఇప్పటికే రిలీజ్ అయింది. కాగా ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ని రేపు ఉదయం 10 గం. 40 ని. లకు టాలీవుడ్ స్టార్ హీరో నాచురల్ స్టార్ నాని రిలీజ్ చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం యూనిట్ ప్రకటించింది.

మెలోడీ బ్రహ్మ మణిశర్మ స్నాగీతం అందిస్తున్న ఈ మూవీకి క్లాక్స్ దర్శకత్వం వహించారు. సీ యువరాజ్ సమర్పిస్తున్న ఈ మూవీని రవీంద్ర బెనర్జీ ముప్పనేని (బెన్నీ) ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీ కథ, కథనాల పై తమకు ఎంతో నమ్మకం ఉందని, అలానే యూనిట్ మొత్తం ఎంతో శ్రమించి దీనిని తెరకెక్కించామని, తప్పకుండా రిలీజ్ తరువాత బెదురులంక 2012 ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇంకా ఈ మూవీలో అజయ్‌ ఘోష్‌, సత్య, రాజ్‌ కుమార్‌ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్‌, ఆటో రాంప్రసాద్‌, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్‌, సురభి ప్రభావతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు