‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ టీమ్ కి టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ బెస్ట్ విషెస్

Published on Mar 17, 2023 2:24 am IST


నాగశౌర్య హీరోగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ రొమాంటిక్ లవ్ కమ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. గతంలో నాగశౌర్య, శ్రీనివాస్ అవసరాల కాంబినేషన్ లో వచ్చిన ఊహలు గుసగుసలాడే అలానే జ్యో అచ్యుతానంద సినిమాలు రెండూ కూడా ఆడియన్స్ మెప్పు అందుకుని మంచి విజయాలు అందుకున్నాయి. దానితో అందరిలో వీరిద్దరి హ్యాట్రిక్ మూవీ అయిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి పై అందరిలో మంచి హైప్ ఏర్పడడం అలానే ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని కూడా ఆకట్టుకుని ఆ అంచనాలు మరింతగా పెంచడం జరిగింది.

ఇక నేడు ప్రేక్షకాభిమానుల ముందుకి వస్తున్న ఈ మూవీకి టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అయిన సమంత రూత్ ప్రభు, అనుష్క శెట్టి తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రత్యేకంగా బెస్ట్ విషెస్ తెలియచేసారు. తప్పకుండా మూవీ మంచి సక్సెస్ అందుకోవాలని కోరుతూ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి టీమ్ ని విష్ చేసిన వీరిద్దరి పోస్ట్ లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంస్థలపై రూపొందిన ఈ మూవీకి కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :