పేర్ని నానితో టాలీవుడ్ దిగ్గజ నిర్మాతల కీలక చర్చ.!

Published on Sep 29, 2021 3:36 pm IST

ఇప్పుడు టాలీవుడ్ లో నెలకొన్న పరిస్థితులు కోసం ఎవరికీ కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెగ్యులర్ సోషల్ మీడియా ఫాలోవర్స్ అందరికీ కూడా ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసు. ఇక ఇదిలా ఉండగా తెలుగు సినిమా విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు ఊహించని పరిణామాలు వైపు తీసుకెళ్ళసాగాయి.

మరి ఇదిలా ఉండగా ఇప్పుడు టాలీవుడ్ సినీ పెద్దలు పలువురు రేపు కలుస్తున్నారని టాక్ ఉండగా ఈరోజు మన టాలీవుడ్ కి చెందిన పలువురు దిగ్గజ నిర్మాతలతో మచిలీ పట్నంలో మంత్రి పేర్ని నాని పాల్గొననున్నారు. మరి ఈ భేటీకి గాను భారీ సినిమాల నిర్మాత నిర్మాత దిల్ రాజు, ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య సునీల్ నారంగ్ అలాగే మైత్రి మూవీ బ్యానర్ నవీన్ సహా, బన్నీ వాసు మరియు వంశీ రెడ్డిలు పాల్గొననున్నారు. మరి ఈ భేటీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు రీత్యా కీలక నిర్ణయాలు తీసుకొననున్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :