టాక్..ఏపీలో ఈ ఇష్యూ ఇంకా క్లియర్ కాలేదా.?

Published on Oct 9, 2021 10:00 am IST

గత కొన్ని రోజులు కితం వరకూ కూడా టాలీవుడ్ మరియు ఏపీ ప్రభుత్వం నడుమ ఎలాంటి వాతావరణం నెలకొందో చూసాము. టికెట్ రేట్స్ సమస్య పరంగా చాలా పెద్ద రచ్చనే లేచింది. కానీ మళ్ళీ తర్వాత సర్దుమణిగినట్టు అనిపించినా అసలు సమస్య అయితే ఇంకా అలానే ఉందట. పాత టికెట్ ధరల పై ద్రుష్టి సారించాలని టాలీవుడ్ పెద్దలు కోరుతుంతాడగా కొంతమేర పెంచినట్టే అనిపించింది. కానీ ఫైనల్ గా మాత్రం ఏపీ ప్రభుత్వం ఇంకా సహేతుకమైన స్పందనను అయితే ఇంకా ఇవ్వలేదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.

దీనితో మళ్ళీ పలు భారీ సినిమాల వసూళ్లపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే మరోపక్క మాత్రం కొంతమంది పలు థియేటర్స్ లో ఆల్రెడీ 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ రన్ చేసుకుంటుండమే కాకుండా రేట్స్ కూడా తమ ఇష్టమొచ్చినట్టే పెట్టుకుంటున్నారని గ్రౌండ్ లెవెల్లో టాక్ ఉంది. కానీ అధికారికంగా మాత్రం పాత టికెట్ ధరలకే అమ్ముకోవాలని మాత్రం ఇంకా ఇష్యూ క్లియర్ కాలేదు. మరి ముందు రోజుల్లో ఎలా ఉండబోతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :