‘పుష్ప ది రూల్’ లో స్పెషల్ సాంగ్ చేయనున్న స్టార్ హీరోయిన్ …?

Published on Sep 28, 2022 3:03 am IST


టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా గత ఏడాది క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక పాన్ ఇండియా మూవీ పుష్ప ది రైజ్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా రిలీజ్ అనంతరం పుష్ప మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో, హీరోగా అల్లు అర్జున్ కి ఎంత క్రేజ్ తెచ్చిపెట్టిందో అందరికీ తెలిసిందే. ఇక త్వరలో దానికి సీక్వెల్ గా పుష్ప ది రూల్ పట్టాలెక్కనుంది.

ఫస్ట్ పార్ట్ ని మించేలా మరింత గ్రాండ్ లెవెల్లో మేకర్స్ ఈ మూవీని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ చేయనున్నారట. అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీలో ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఒక స్పెషల్ సాంగ్ చేయనున్నారని తెలుస్తోంది. అయితే పుష్ప ది రైజ్ లో సమంత చేసిన ఊ అంటావా మామ సాంగ్ సూపర్ గా పాపులర్ అవడంతో సెకండ్ పార్ట్ లో కాజల్ తో సాంగ్ చేయించాలని భావించారట సుకుమార్. అయితే దీనిపై పుష్ప యూనిట్ నుండి మాత్రం అఫీషియల్ గా ప్రకటన రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :