లేటెస్ట్ : ఇకపై షూటింగ్స్ తో ఫుల్ బిజీ కానున్న టాప్ టాలీవుడ్ స్టార్స్

లేటెస్ట్ : ఇకపై షూటింగ్స్ తో ఫుల్ బిజీ కానున్న టాప్ టాలీవుడ్ స్టార్స్

Published on Nov 4, 2022 12:19 AM IST


టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోలుగా మంచి క్రేజ్ తో కొనసాగుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అతి త్వరలో తమ లేటెస్ట్ మూవీ షూట్స్ లో పూర్తిగా బిజీ కానున్నారు. ఇటీవల చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి చేసిన ఆర్ఆర్ఆర్ మూవీ గ్లోబల్ గా ఎంతో పెద్ద సక్సెస్ కొట్టింది. అనంతరం శంకర్ తో ఒక భారీ పాన్ ఇండియా మూవీ మొదలెట్టిన చరణ్, ఇటీవల కొంతమేర ఆ మూవీ షూట్ లో పాల్గొన్నారు. ఇక కొద్దిరోజులుగా ఫ్యామిలీతో వెకేషన్ లో ఉన్న చరణ్ నిన్న ఇండియాకి తిరిగి వచ్చారు. అతి త్వరలో శంకర్ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ లో పాల్గొనున్నారు చరణ్. అలానే గత కొన్నాళ్లుగా ఎన్టీఆర్, కొరటాల శివ ల తాజా మూవీ షూట్ ప్రారంభానికి సంబంధించి పలు వార్తలు ప్రచారం అవుతున్నాయి.

ఇటీవల ఈ మూవీ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసిన కొరటాల, ఫైనల్ గా దానిని సిద్ధం చేయగా మరోవైపు ఎన్టీఆర్ కూడా తన పాత్ర కోసం శారీరకంగా మంచి మేకోవర్ తో సిద్ధం అయ్యారు. కాగా ఈ మూవీ కూడా అతి త్వరలోనే పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరితో పాటు ఇటీవల త్రివిక్రమ్ తో తన తాజా సినిమా మొదలెట్టి ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు, కొద్దిరోజుల క్రితం ఫ్యామిలీతో కలిసి లాండన్ వెకేషన్ వెళ్లారు. కాగా నాలుగు రోజుల క్రితం ఇండియాకి తిరిగి వచ్చిన మహేష్, ఈ వారంలోనే త్రివిక్రమ్ మూవీ సెకండ్ షెడ్యూల్ లో పాల్గొననున్నారు. మొత్తంగా ఈ టాప్ స్టార్స్ ముగ్గురు అతి త్వరలో కెరీర్ పరంగా తమ తాజా సినిమాల షూటింగులతో ఫుల్ బిజీగా గడపనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు