సమ్మర్ వెకేషన్ కోసం విదేశాలకు టాలీవుడ్ టాప్ స్టార్స్ ?

సమ్మర్ వెకేషన్ కోసం విదేశాలకు టాలీవుడ్ టాప్ స్టార్స్ ?

Published on Apr 1, 2023 2:39 AM IST


టాలీవుడ్ స్టార్ హీరోలైన సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమ సినిమాల షూటింగ్ మధ్యలో కొద్దిపాటి గ్యాప్ వస్తే కుటుంబంతో కలిసి సరదాగా వెకేషన్ కి వెళ్తుంటారు. ఆ విధంగా ఈ ఇద్దరూ ఎక్కువగా ఫ్యామిలీతో గడిపేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే విషయం ఏమిటంటే, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లుతో పాటు సముద్రఖని దర్శకత్వంలో వినోదయ సిత్తం రీమేక్ లో నటిస్తున్న సంగతి తెల్సిందే.

అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం పవర్ స్టార్ నిన్న తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు సమ్మర్ వెకేషన్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక మరొక హీరో అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ గా త్రివిక్రమ్ తో తన కెరీర్ 28వ చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి దాదాపుగా రెండు నుండి మూడు వారల వరకు గ్యాప్ లభించడంతో మరొక రెండు రోజుల్లో సూపర్ స్టార్ కూడా విదేశాలకు సమ్మర్ వెకేషన్ కి వెళ్లనున్నారట. కాగా మహేష్ 28 మూవీ 2024 జనవరి 13న విడుదల కానుండగా పవన్ నటిస్తున్న వినోదయ సిత్తం రీమేక్ మూవీ 2023 జులై 28న రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు