మనస్తాపానికి లోనై టాలీవుడ్ యువ నటి ఆత్మహత్య.!

Published on Sep 30, 2021 3:00 pm IST


తాజాగా టాలీవుడ్ లో ఓ దారుణ ఘటన చోటు చేసుకోవడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చగా మారింది. టాలీవుడ్ లో పలు చిత్రాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా వర్క్ చేస్తున్నటువంటి అనురాధ అనే యువ నటి తాను నివాసం ఉండే ఫిలిం నగర్ ప్రాంతంలోనే ఉరి వేసుకున్న ఘటన ఆలస్యంగా బయటకి వచ్చింది. అయితే ఇందులో ఇంకా లోతుగా వెళ్లినట్టయతే..

గత కొన్నాళ్ల కితం అనురాధ కి కిరణ్ అనే యువకుడితో పరిచయం కాగా వీరిద్దరూ ఒకటైతే హైదరాబాద్ లో సహజీవనం చెయ్యసాగారు. కానీ తర్వాత కిరణ్ వేరే అమ్మాయితో దగ్గరగా ఉండడం నిశ్చితార్థం చేసుకోవడం అను దృష్టికి రాగా అతడిని వదులుకోలేక వాగ్వాదం పెట్టుకుంది. అయినా కూడా కిరణ్ అను ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని ఫిరాయించడంతో తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యి తన గదిలోనే ఉరి వేసుకొని చనిపోయింది.

అయితే ఈ విషయం బయటకి చాలా ఆలస్యంగా వచ్చింది. బహుశా తాను ఒక్కతే ఇక్కడ ఉంటుంది కాబోలు అందుకే ఆత్మహత్య చేసుకున్న రోజులు తర్వాత పాడైన శరీరం నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకి స్థానికులు సమాచారం ఇవ్వగా వారి ఇన్వెస్టిగేషన్ లో అసలు విషయం బయట పడింది.

సంబంధిత సమాచారం :