‘బిచ్చగాడు – 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ గా టాలీవుడ్ యంగ్ హీరో

Published on May 15, 2023 9:40 pm IST

ఏడేళ్ళ క్రితం తెలుగులో చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద పెద్ద సక్సెస్ అందుకున్న తమిళ్ డబ్బింగ్ మూవీ బిచ్చగాడు. విజయ్ ఆంటోని హీరోగా నటించిన ఈ మూవీని శశి తెరకెక్కించారు. ఇక మళ్ళి ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్ గా బిచ్చగాడు 2 తెరకెక్కించారు. ఈ మూవీని ఫాతిమా విజయ్ ఆంటోనీ గ్రాండ్ లెవెల్లో విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై బాగా అంచనాలు ఏర్పరిచాయి.

కావ్య థాపర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి విజయ్ ఆంటోనీ స్వయంగా దర్శకత్వం వహించడం విశేషం. కాగా మ్యాటర్ ఏమిటంటే, బిచ్చగాడు 2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రేపు హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో సాయంత్రం 6 గం. ల నుండి నిర్వహించనుండగా దీనికి టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ప్రత్యేక అతిథిగా విచ్చేయనున్నారు. ఈ విషయం కొద్దిసేపటి క్రితం టీమ్ వెల్లడించింది. కాగా మే 19న మంచి హైప్ తో ఆడియన్స్ ముందుకి వస్తున్న తమ మూవీ తప్పకుండా అందరి అంచనాలు అందుకుని సక్సెస్ అవుతుందని బిచ్చగాడు 2 యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం :