‘కృష్ణమ్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్టులుగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్

టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కృష్ణమ్మ. వి.వి.గోపాలకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని కృష్ణ కొమ్మలపాటి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మే 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీని టాలీవుడ్ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్‌, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ విడుదల చేస్తున్నాయి. రా అండ్‌ రస్టిక్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ ఇది. స్నేహం కోసం ఎంత దూరమైన వెళ్లే యువకుడిగా సత్యదేవ్‌ ఇందులో పవర్‌ఫుల్‌ రోల్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

విషయం ఏమిటంటే, కృష్ణమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మే 1న సాయంత్రం 6 గం. ల నుండి హైదరాబాద్, హైటెక్ సిటీలోని ట్రైడెంట్ హోటల్ లో గ్రాండ్ గా నిర్వహించనుండగా దీనికి చీఫ్ గెస్టులుగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ అయిన రాజమౌళి, కొరటాల శివ, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, సుకుమార్ హాజరు కానున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం ఒక పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసారు. కాగా ఈ మూవీలో అతీరారాజ్‌, లక్ష్మణ్‌, కృష్ణ, అర్చన, రఘు కుంచె, నందగోపాల్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా ఫోటోగ్రఫిని సన్నీ కూరపాటి, సంగీతాన్ని కాలభైరవ అందిస్తున్నారు.

Exit mobile version