“ఆర్ఆర్ఆర్” ఈవెంట్‌కి ఆ హాలీవుడ్ స్టార్ రానున్నాడా?

Published on Feb 24, 2022 1:14 am IST

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా కలిసి నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం “రౌద్రం రణం రుధిరం”. కరోనా కారణంగా ఇప్పటికే పలుమార్లు వాయిదాపడుతూ వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు మార్చి 25న విడుదలకు సిద్దమవుతుండడంతో త్వరలోనే చిత్ర బృందం తిరిగి ప్రమోషన్స్‌ని మొదలు పెట్టబోతుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీస్థాయిలో చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

అయితే ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దుబాయ్ లో జరగబోతున్న ఈ ఈవెంట్ కి ప్రముఖ హాలీవుడ్ యాక్టర్ టామ్ క్రూజ్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాలో ఒలీవియా మోరిస్, రే స్టీవెన్సన్ వంటి హాలీవుడ్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సంబంధిత సమాచారం :