‘మాస్ట్రో’ నుంచి రేపు ఫుల్ వీడియో ప్రమోషనల్ సాంగ్..!

Published on Sep 11, 2021 11:24 pm IST


యూత్ స్టార్ నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “మాస్ట్రో”. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “అంధధూన్’కి రీమేక్‌గా తెరకెక్కించిన ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్రలో నటించింది. ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ సినిమా సెప్టెంబ‌ర్ 17 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది.

అయితే తాజాగా నేడు ఈ సినిమా నుంచి ప్రమోషనల్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ‘మాస్ట్రో.. మాస్ట్రో’ అంటూ సాంగే ఈ ప్రమోషనల్ సాంగ్ ఫుల్ వీడియోను రేపు సాయంత్రం 5:04 నిమిషాలకు విడుదల కాబోతుంది. ఈ పాటకు శ్రీమణి సాహిత్యాన్ని అందించగా, రేవంత్ ఆలపించాడు. మహతి స్వరసాగర్ సంగీతం అందించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :