రెండోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్న స్టార్ కమెడియన్ !

కమెడియన్ గా ఉన్నత స్థాయిలో ఉండగానే హీరోగా కొత్త టర్న్ తీసుకున్నాడు నటుడు సప్తగిరి. హీరో అయ్యే ప్రయత్నంలో భాగంగా ఆయన చేసిన మొదటి సినిమా ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ గత ఏడాది డిసెంబర్లో విడుదలై పర్వాలేదనిపించుకున్నా హీరోగా నిలదొక్కుకోవడానికి కావాల్సిన హిట్ ను మాత్రం సప్తగిరి అందుకోలేకపోయారు. అందుకే ఆయన రెండో ప్రయత్నంగా ‘సప్తగిరి ఎల్.ఎల్.బి’ పేరుతొ రేపు ప్రేక్షకుల ముందుకురానున్నారు.

టీజర్, ట్రైలర్లతో ఆకట్టుకున్న ఈ చిత్రాన్ని చరణ్ లక్కాకుల డైరెక్ట్ చేయగా సప్తగిరి మొదటి సినిమాని నిర్మించిన నిర్మాత డా.కె.రవి కిరణే ఈ సినినిమాని కూడా నిర్మిస్తున్నారు. హిందీ సూపర్ హిట్ సినిమా ‘జాలీ ఎల్.ఎల్.బి’ కు తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో సప్తగిరి లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు. మరి ఆయన చేస్తున్న ఈ రెండో ప్రయత్నం పూర్తిస్థాయిలో విజయం సాధించాలని ఆశిద్దాం.