కేజీఎఫ్2 నుండి పవర్ ఫుల్ “తుఫాన్” సాంగ్ రిలీజ్!

Published on Mar 21, 2022 11:37 am IST

యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కేజీఎఫ్2. కేజీఎఫ్ చాప్టర్ కి కొనసాగింపు గా వస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొదటి పార్ట్ తో కేవలం సౌత్ నాట మాత్రమే కాకుండా, ఆల్ ఓవర్ ఇండియా లో సెన్సేషన్ సృష్టించింది కేజీఎఫ్. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రం కి సంబంధించిన ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ వేగవంతం చేయడం జరిగింది. ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ను మార్చ్ 27 న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించగా, తాజాగా ఈ చిత్రం నుండి తుఫాన్ సాంగ్ ను విడుదల చేయడం జరిగింది. పాన్ ఇండియా మూవీ గా వస్తున్న ఈ చిత్రం ను కన్నడ లో మాత్రమే కాకుండా, తెలుగు, మలయాళం, తమిళ్ లతో పాటుగా హిందీ లో కూడా విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 14, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :