‘రియల్‌ రెబల్‌ స్టార్‌ ఆశీస్సులు అందాయి’ – మంచు విష్ణు

Published on Oct 4, 2021 5:34 pm IST

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలు త్వరలో జరగబోతున్న నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ – మంచు విష్ణు మధ్య పోటీ రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. మేమంటే మేము అంటూ ఇరు వర్గాలు బరిలో నిలిచాయి. ఈ క్రమంలో ప్రకాశ్‌ రాజ్‌ కి మెగాస్టార్ అండ లభించింది. ఈ నేపథ్యంలో మంచు విష్ణు మిగిలిన సినీ పెద్దల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో తాజాగా రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజుతో మంచు విష్ణు భేటీ అయి… మా ఎన్నికల్లో తనకు మద్ధతు ఇవ్వాలని ఈ సందర్భంగా విష్ణు కోరారు.

కాగా కృష్ణం రాజుతో కలిసి దిగిన ఫోటోను మంచు విష్ణు షేర్‌ చేస్తూ.. ‘రియల్‌ రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు నుంచి ఆశీస్సులు అందాయి’ మంచు విష్ణు ట్వీట్‌ చేశారు. ఇక అక్టోబర్‌ 10న మా ఎ‍న్నికలు జరగనున్నాయి. ‘మా’ అధ్యక్ష పదవి కోసం ప్రకాశ్‌ రాజ్‌, మంచు విష్ణు మధ్య గట్టి పోటీ నెలకొన్న నేపథ్యంలో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ నెలకొంది. కాగా అక్టోబర్‌ 10న మా ఎ‍న్నికలు జరగనున్నాయి. మంచు విష్ణుకి బాలయ్య సపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :