ట్విట్టర్ క్వీన్ : సౌత్ ఇండియాలో శ్రుతి హాసన్ నెంబర్ 1.

Sruthi-Hasan

సోషల్ మీడియాలో శృతి హాసన్ హవా కొనసాగుతుంది. ‘గబ్బర్ సింగ్’, ‘బలుపు’, ‘ఎవడు’, ‘రేసుగుర్రం’ ఇలా వరుసగా శృతి హాసన్ నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఈ విజయాలతో శృతి హాసన్ కు అబిమానులు పెరిగారు. ట్విట్టర్ లో శృతిని ఫాలో అయ్యే అభిమానుల సంఖ్య 1.21 మిలియన్ చేరుకుంది. త్రిష, సమంత, హన్సికలు వంటి స్టార్ హీరోయిన్లు ఫాలో అయ్యేవారి సంఖ్య వన్ మిలియన్ లోపు ఉండడం గమనార్హం. వాళ్ళు శృతిని చేరుకోవడం ఇప్పట్లో అసాధ్యం.

రెగ్యులర్ గా అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం, తన సినిమాలకు సంబందించిన విషయాలను ట్విట్టర్లో పోస్ట్ చేయడం వంటి అంశాలు శృతిని మిగతా స్టార్ కంటే ప్రత్యేకంగా నిలిపాయి.

ట్విట్టర్ లో టాప్ సౌత్ ఇండియా హీరోయిన్లు :

శృతి హాసన్ : 1.21 మిలియన్ ఫాలోయర్స్

త్రిష : 0.89 మిలియన్ ఫాలోయర్స్

హన్సిక : 0.66 మిలియన్ ఫాలోయర్స్

సమంత : 0.64 మిలియన్ ఫాలోయర్స్

Exit mobile version