పవన్ – త్రివిక్రమ్ సినిమాకి పనిచేయనున్న పాపులర్ స్టంట్ మాస్టర్ !


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెసిందే. వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన ‘జల్సా, అత్తారింటికి దారేది’ వంటి సినిమాలు భారీ విజయాల్ని సాధించడంతో ఈ ప్రాజెక్ట్ పై కూడా అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇకపోతే ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించిన ఒక కొత్త వార్త బయటికొచ్చింది.

అదేమిటంటే ఈ సినిమా కోసం పాపులర్ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ పనిచేయనున్నారట. అయితే ఈ విషయంపై త్రివిక్రమ్ టీమ్ నుండి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు. గతంలో పీటర్ హెయిన్స్ త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ‘అతడు, ఖలేజా, జులాయి, అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి’ వంటి పలు హిట్ చిత్రాలకు పని చేశారు. అంతేగాక ఇటీవలే మోహన్ లాల్ ‘పులి మురుగన్’ సినిమాకి గాను బెస్ట్ స్టంట్ కొరియోగ్రాఫర్ గా నేషనల్ అవార్డుని కూడా అందుకున్నారు. మరొక స్టంట్ కొరియోగ్రాఫర్ విజయన్ కూడా ఈ సినిమాకి షూటింగ్ ఆరంభమైన తొలి రోజు నుండే పనిచేస్తున్న సంగతి తెలిసిందే.