ప్రభాస్ కోసం టాప్ క్లాస్ టెక్నీషియన్స్ !


రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ ప్రాజెక్ట్ కోసం సుమారు 3 ఏళ్లకు పైగా సమయం కేటాయించిన ప్రభాస్ ఈరోజే కొత్త సినిమాను ప్రారంభించనున్నాడు. దీంతో ఆయన అభిమానులు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా సందడి చేస్తున్నారు. మరోవైపు ప్రభాస్ సన్నిహితుడు,’రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ సింగ్ కూడా చాన్నాళ్లుగా వేచి చూస్తున్న తన డ్రీమ్ ప్రాజెక్ట్ మొదలుకానుండటంతో చాలా ఎగ్జైటింగా ఉన్నాడు.

ప్రభాస్ ఈ సినిమాలో ఇప్పటి దాకా చేయని పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడట. అందుకోసం ఇప్పటికే వర్కవుట్స్ చేసి బాడీని కాస్త నార్మల్ స్టేజ్ కి తీసుకొచ్చాడట రెబల్ స్టార్. ఇకపోతే ఈ ప్రాజెక్ట్ కోసం టాప్ క్లాస్ టెక్నీషియన్లు పనిచేయనుండటం విశేషంగా చెప్పుకోవాలి. ‘మిర్చి, శ్రీమంతుడు, ఘాజి’ వంటి సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించిన మది ఈ చిత్రానికి కెమెరా వర్క్ చేస్తుండగా నాలుగు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, పాపులర్ సంగీత దర్శకులు శంకర్, ఇహసాన్, లోయ్ లు ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేయనున్నారు.