నట విశ్వరూపం చుపించబోతున్న టాప్ హీరో !

మోహన్ బాబు ప్రధాన పాత్రలో వస్తోన్న సినిమా గాయత్రి. మదన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు డైమండ్ రత్నబాబు కథ మాటలు అందించారు. ఈ రోజు విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభిస్తోంది. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమాలో మోహన్ బాబు డబుల్ యాక్షన్ చేయనున్నట్టు స‌మాచారం. ఇందులో ఒకటి హీరో అయితే మరొకటి విలన్. రెండు విభిన్న పాత్రల్లో మోహన్ బాబు తన నట విశ్వరూపం చూపించబోతున్నాడు. అనసూయ ఈ సినిమాలో రిపోర్టర్ పాత్రలో కనిపించబోతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో మోహన్ బాబు హిట్ కొడతాడని ఆశిద్దాం.